: 4జీ స్మార్ట్ ఫోన్ ధర కేవలం 4,999/-
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తృతమవుతోంది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. దీంతో మొబైల్ ఫోన్ల తయారీ సంస్ధ జెడ్‌టీఈ 4వ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ను కేవలం 4,999 రూపాయలకే అందించనుంది. బ్లేడ్ క్యూలక్స్ పేరిట అందుబాటులోకి రానున్న ఈ మోడల్ భారత్ లో అత్యంత చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ అని ఆ సంస్ధ తెలిపింది. ఈ ఫోన్ లో డేటా స్పీడ్ 150 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని వెల్లడించింది. 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఆటోఫోకస్ లెడ్ ఫ్లాష్ కలిగిన 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌టర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలని ఆ సంస్ధ పేర్కొంది. ఈ ఫోన్ ఆన్‌డ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని ఆ సంస్ధ తెలిపింది. ఈ ఫోన్ జూన్ 16 నుంచి అమెజాన్ డాట్ కామ్ లో లభిస్తుందని ఆ సంస్ధ తెలిపింది.