: చంద్రబాబు జైలుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నా: విజయసాయి రెడ్డి
తమను అన్యాయంగా జైలుకు పంపిన చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తమను జైలుకు పంపడంలో ఆయన కుట్ర ఉందని ఆరోపించారు. బాబు నేరం చేశాడు కాబట్టే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్న విజయసాయి, ఆధారాలున్నా ఎందుకాయనను అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. ఏపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, 120 ఫోన్లు ట్యాప్ అయ్యాయని బాబు చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు అమ్మేది పాతూరి రామారావు, సుజనాచౌదరి మాత్రమేనని విజయసాయి ఆరోపించారు.