: విమానం ఇంజిన్ లో మంటలు... ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్


మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఇంజిన్ లో మంటలు లేచాయనే సాంకేతిక సమాచారంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. దీంతో విమానాన్ని మెల్ బోర్న్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మెల్ బోర్న్ నుంచి మలేసియాకు 300 మంది ప్రయాణికులతో మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బయల్దేరింది. బయల్దేరిన కొద్ది సేపటికే ఇంజిన్ లో మంటలు రేగినట్టు సిగ్నల్ చూపించింది. తక్షణం స్పందించిన పైలట్ తిరిగి మెల్ బోర్న్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానంలోని ప్రయాణికులను దించేసి పరీక్షలు నిర్వహించగా, సాంకేతిక లోపం కారణంగా సిగ్నల్ చూపించిందని విమానాశ్రయాధికారులు వెల్లడించారు. ఇంజిన్ లో ఎలాంటి మంటలు చెలరేగలేదని, అలాంటి ఆనవాళ్లు కూడా లేవని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News