: పూర్వవైభవం కోసం ప్రజలంతా కసితో ఉన్నారు: మురళీమోహన్
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై తీవ్రంగా స్పందించిన ఆయన, విభజన కారణంగా రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పూర్వవైభవం సాధించేందుకు ప్రజలు కసితో ఉన్నారని తెలిపారు. ఇష్టంవచ్చినట్టు రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఓ పార్టీ నిలువునా చీల్చేస్తే, మరోపార్టీ నిలువునా దోచేసిందని కాంగ్రెస్, వైసీపీలను ఉద్దేశించి అన్నారు.