: కేసీఆర్ ఖబడ్దార్... కాంగ్రెస్ ను ఏమీ చేయలేవు: భట్టి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ, టీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలని ఆరోపించారు. వారి కుటుంబాల కోసం రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇదే సమయంలో కేసీఆర్ కు భట్టి సవాల్ చేశారు. 'ఖబడ్దార్... కాంగ్రెస్ ను ఏమీ చేయలేవు' అని భట్టి హెచ్చరించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అడ్డదారిలో అందలం ఎక్కాలని చూడటంలో సీఎం చంద్రబాబు, కేసీఆర్ లు తోడు దొంగలని వ్యాఖ్యానించారు.