: ఏపీలో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం
ఏపీలో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం నెలకొని ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో జల్లులు పడతాయని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో విశాఖలో 9 సెం.మీ, విజయనగరం జిల్లాలో పలు చోట్ల 3 సెం.మీ చొప్పున, కళింగపట్నంలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు, తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా, ఏపీ దక్షిణకోస్తాను ఆనుకుని తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది.