: ఏసీఏ కార్యదర్శిగా మళ్లీ గోకరాజు గంగరాజు!
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శిగా మరోమారు గోకరాజు గంగరాజు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొద్దిసేపటి క్రితం ముగిసిన ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం కార్యదర్శి పదవికి గోకరాజు గంగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్బంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, ఏపీలోని 13 జిల్లాల్లో స్టేడియాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.15 లక్షలు విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవ్యాంధ్ర సమీపంలోని మంగళగిరిలో ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభించనున్నామని ఆయన పేర్కొన్నారు. పనుల ప్రారంభోత్సవానికి బీసీసీఐ అధ్యక్షుడిని ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.