: 'వీసా' దెబ్బకు 'బేర్'మన్న టీసీఎస్, ఇన్ఫీ


హెచ్-1బీ వీసాల్లో అవకతవకలు జరిగాయని, భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ లపై యూఎస్ లేబర్ డిపార్టుమెంటు విచారణ జరుపుతోందని న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో రెండు కంపెనీల ఈక్విటీలూ దిగజారాయి. మధ్యాహ్నం 12:30 గంటల వరకూ లాభాల్లో ఉన్న రెండు కంపెనీల ఈక్విటీ విలువ అరగంట వ్యవధిలో ఒక శాతానికి పైగా పడిపోయింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో టీసీఎస్ క్రితం ముగింపుతో పోలిస్తే 1.63 శాతం నష్టంతో, ఇన్ఫోసిస్ 0.78 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంలో ఉంది.

  • Loading...

More Telugu News