: ఫోరెన్సిక్ ల్యాబ్ కు రేవంత్ రెడ్డి సెల్ ఫోన్... మరో రెండు రోజుల్లో వాయిస్ ల నిర్ధారణ
ఓటుకు నోటు కేసులో తమ చేతికి చిక్కిన ఆధారాలను పూర్తి స్థాయిలో నిర్ధారించుకునేందుకు తెలంగాణ ఏసీబీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలకు చెందిన సెల్ ఫోన్లను ఏసీబీ అధికారులు హైదరాబాదులోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపారు. సెల్ ఫోన్లలో సదరు వ్యక్తుల వాయిస్, ఆడియో టేపుల్లోని వాయిస్ ఒకటేనా? కాదా? అన్న విషయాన్ని తెలపాలని ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఏసీబీ అధికారులు సూచించారు. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అందే నివేదికను సరిచూసుకుని ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.