: భారత విమానాశ్రయంలో చైనా జెట్ ఎమర్జన్సీ ల్యాండింగ్


చైనా నుంచి 9 మందితో బయలుదేరిన ఓ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అగర్తలా ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. బీజింగ్ కాపిటల్ ఎయిర్ లైన్స్ కు చెందిన జీ 650 జెట్ లో నలుగురు వ్యాపారవేత్తలు, ఐదుగురు క్రూ సభ్యులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ విమానంలో ఏర్పడిన సమస్యను తొలగించేందుకు అవసరమైన పరికరాలు, ఇంజనీర్ ఇంకా రాలేదని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.డీ బర్మన్ తెలిపారు. నేడు విమానం ఇండియాలోనే ఉంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News