: తోమర్ ను బహిష్కరించనున్న ఆప్!
తన విద్యార్హతలకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించాడన్న ఆరోపణలపై అరెస్టై, న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన జితేంద్ర సింగ్ తోమర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. తోమర్ తప్పు చేశాడనటానికి బలమైన ఆధారాలు ఉన్నట్టు వెల్లడి కావడంతో ఆ మచ్చ తమపై పడకుండా ఉండాలంటే బహిష్కరణ ఒక్కటే మార్గమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత రాత్రి ప్రత్యేకంగా సమావేశమైన ఆప్ నేతలు ఇదే విషయాన్ని చర్చించారు. మరో రెండు రోజుల్లో ఆయన బహిష్కరణపై ప్రకటన వెలువడవచ్చని సమాచారం. కాగా, తోమర్ కు బెయిలిచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది.