: హైదరాబాదు చేరుకున్న నరసింహన్... చంద్రబాబు, కేసీఆర్ లతో విడివిడిగా భేటీ అయ్యే అవకాశం!


మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. నిన్న తనతో భేటీ అయిన నరసింహన్ కు ప్రధాని నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించే దిశగా చర్యలు ప్రారంభించాలని, అవసరమైతే ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కావాలని కూడా మోదీ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో విడివిడిగా భేటీ కావాలని నరసింహన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం వెల్లడి కానుంది.

  • Loading...

More Telugu News