: ఆ డబ్బు... టీడీపీ ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసిందేనట!


ఓటుకు నోటు కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముట్టజెప్పిన డబ్బు టీడీపీకి చెందిన ఓ ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసిందేనని తెలంగాణ ఏసీబీ అనుమానిస్తోంది. అంతేకాక, సదరు ఎంపీకి చెందిన ఏ బ్యాంకు, ఏ శాఖ నుంచి డబ్బు డ్రా చేశారన్న విషయానికి సంబంధించి ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. సదరు ఎంపీ... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతేనని కూడా ఏసీబీ తేల్చినట్లు సమాచారం. స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలను ముట్టజెప్పిన రేవంత్ రెడ్డి, మిగిలిన రూ.4.5 కోట్లను తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు. స్టీఫెన్ సన్ నుంచి సదరు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ, వాటిపై ఉండాల్సిన లేబుళ్లు కనిపించకపోవడంతో నోట్లపై ఉన్న నెంబర్ల ఆధారంగా సదరు డబ్బు ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారన్న విషయాన్ని ఛేదించడానికి తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చిందట. ఇక మిగిలిన రూ.4.5 కోట్ల డబ్బు ఎక్కడ ఉందన్న అంశంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ దిశగా సాగుతున్న దర్యాప్తు అనుకున్నంత వేగంగా సాగడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు కూడా టీ టీడీపీ యత్నించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దిశగానూ ఏసీబీ ఆరా తీస్తోందట.

  • Loading...

More Telugu News