: మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ డెమో చూసి ఆశ్చర్యపోయిన 'కళాతపస్వి'


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొత్తగా క్రియేటివ్ మెంటార్ మోషన్ క్యాప్చర్ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ నూతన గ్రాఫిక్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో 'కళాతపస్వి' కె.విశ్వనాథ్ పాల్గొన్నారు. కదలికలను గుర్తించి, వాటితో పాత్రలకు ప్రాణం పోయడమే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ విశిష్టత. కాగా, స్టూడియో ప్రారంభోత్సవంలో పాల్గొన్న విశ్వనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలుగు చిత్రాలకు హైదరాబాదులోనే హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ చేయడం గొప్ప విషయమని తెలిపారు. ఇదంతా చూసిన తర్వాత టెక్నలాజికల్ గా అద్భుతాలు చేయవచ్చని తెలిసిందని అన్నారు. ఈ స్టూడియో చాలా అధునాతనంగా ఉందని, ఇక్కడి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతస్థాయిలో ఉందని కొనియాడారు. మోషన్ క్యాప్చర్ డెమో చూసిన తర్వాత వారెన్ని అద్భుతాలు సృష్టించగలరో అర్థమైందని అన్నారు. ఇది కూడా ఒక అపరబ్రహ్మ సృష్టిలా తనకనిపిస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్టూడియో ఏ హాలీవుడ్ స్టూడియోకి తీసిపోకుండా పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News