: విశాఖలో వైసీపీ కథ ముగిసింది: గంటా


విశాఖలో వైసీపీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో కచ్చితంగా రెండు స్థానాలు గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుతో రేపు (శుక్రవారం) తాను, అయ్యన్నపాత్రుడు భేటీ అవుతామని తెలిపారు. ఆలస్యమైనా చంద్రబాబు మంచి అభ్యర్థిని ఎంపికచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అటు, జిల్లాల నేతలతో ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులను రేపు ఖరారు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News