: చంద్రబాబుపై హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం


టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందని, ఆ కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చాలని తన ఫిర్యాదులో కోరింది. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ... చంద్రబాబు తన నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనోహర్ హెచ్చార్సీని కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News