: నా పని ఏంటో, ఎంత వరకో బాగా తెలుసు: ద్రవిడ్
కోచ్ గా తన పని ఏమిటో, ఎంత వరకో బాగా తెలుసని టీమిండియా దిగ్గజ క్రికెటర్, భారత అండర్ 19, భారత్ ఏ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కోచ్ గా ఆటగాళ్లలో ఉన్న నైపుణ్యం వెలికి తీయడం, బలహీనతలు లేని వారిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. సెలక్షన్ లో తన ప్రమేయం ఉండదని, సెలెక్ట్ చేసి ఇచ్చిన వారిని ఉత్తమమైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దడమే తన పని అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. యువ ఆటగాళ్లలో బలహీనతలు గుర్తించి, వాటిని పారద్రోలడమే కోచ్ గా చేయాల్సిన పని అని ద్రవిడ్ పేర్కొన్నాడు. టీమిండియాకు నాణ్యమైన ఆటగాళ్లను అందిస్తానని ద్రవిడ్ చెప్పాడు.