: లోక్ సభ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా
తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన కొద్దిసేపటి కిందట లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిశారు. ఈ సమయంలో తన రాజీనామా లేఖను ఆమెకు సమర్పించారు. ఈ నెల 1న కడియం టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాంతో ఆయన తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది.