: మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ... రెండు రాష్ట్రాల పరిస్థితిపై చర్చ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కొద్దిసేపటి కిందట ఆయన భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి వివరించిన గవర్నర్, ఓ నివేదిక సమర్పించారు. అంతకుముందు గవర్నర్ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పలు అంశాల పురోగతిపై చర్చించినట్టు తెలిసింది. రెండురోజుల కిందట ఢిల్లీ వెళ్లిన గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.