: ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ తో జగన్ భేటీ


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం, ఇందులో సీఎం చంద్రబాబుకు సంబంధించిన అంశాలపై జగన్ చర్చించనున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడినట్టు బయటపడిన సంభాషణలపై సీబీఐ విచారణ జరిపించాలని రాజ్ నాథ్ ను జగన్ కోరే అవకాశం ఉంది. ఐదు గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని పార్టీ ఎంపీలతో కలసి జగన్ కలవనున్నారు.

  • Loading...

More Telugu News