: డాక్టరును అవమానించిన కేసులో సింగర్ మికా సింగ్ అరెస్ట్
ఓ సంగీత ప్రదర్శనలో డాక్టరును చెంప దెబ్బ కొట్టి అవమానించిన కేసులో బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ ను ఢిల్లీ పోలీసులు ఈ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షనులో పాటలు పాడేందుకు వెళ్లిన మికా సింగ్ స్టేజిపై అంబేద్కర్ హాస్పిటల్ లో ఆప్తమాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ ను కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేసిన పోలీసులు తప్పు మికాదేనని నిర్ధారించి, నేడు అదుపులోకి తీసుకున్నారు.