: పాకిస్థాన్ మంత్రి భయపడ్డారు, అందుకే అలా స్పందించారు: రక్షణ మంత్రి పారికర్
పాకిస్థాన్ మంత్రి భయంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. సరిహద్దులు దాటి తీవ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి తమది మయన్మార్ ప్రభుత్వం కాదని, బెదిరింపులతో తమను లొంగదీసుకోలేరని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసర్ అలీ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై పారికర్ ఢిల్లీలో మాట్లాడుతూ, జరిగిన చర్యకు భయపడిన వారు మాత్రమే అలా స్పందిస్తారని అన్నారు. కాగా, మయన్మార్ లో భారత సైన్యం జరిపిన దాడి ఇతర దేశాలకు హెచ్చరిక లాంటిదని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. దీనిపైనే పాక్ మంత్రి స్పందించారు.