: చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు: తలసాని


ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఎవరూ కాపాడలేరని, ఆయన ఫ్రస్ట్రేషన్ లో వుండడం వల్ల తీవ్ర అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తున్నాడే తప్ప, రేవంత్ రెడ్డిని తాను పంపలేదని మాత్రం ఎక్కడా చెప్పడం లేదని తెలిపారు. 'నీతినిజాయతీ లేని వ్యక్తి చంద్రబాబు' అని విమర్శించారు. చాలా సిల్లీగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక, హైదరాబాదులోని నివాసం వద్ద చంద్రబాబు ఏపీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకోవడం సరికాదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News