: బాలయ్య దర్శనమే కరవైంది... హిందూపురం ప్రజల ఆవేదన: తెలుగు పత్రిక సర్వే వెల్లడి


తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు పాలనా పగ్గాలు చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తైంది. ఇక ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన నేతలూ ఏడాది పూర్తి చేసుకున్నారు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? అంటే, ఈ జాబితా చాలా పెద్దదేనని చెబుతోంది ఓ తెలుగు దినపత్రిక. ప్రత్యేకించి ఏపీ ఎమ్మెల్యేలపై చేసిన సర్వేను సదరు పత్రిక నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అగ్రస్థానంలో ఉన్నారట. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఆయన హిందూపురం ప్రజలను పట్టించుకోవడం లేదట. అడపాదడపా అక్కడ పర్యటనకు వెళుతున్న బాలయ్య, ఆ తర్వాత హిందూపురం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారట. ఈ విషయాన్ని ఆ నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారని సదరు సర్వే వెల్లడించింది. ఇక ఈ జాబితాలో టాప్ టెన్ లో బాలయ్య సహా ముగ్గురు టీడీపీ సభ్యులుండగా, ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఓ బీజేపీ సభ్యుడు ఉన్నారట. ఈ జాబితాలో మహిళా మంత్రి కిమిడి మృణాళిని కూడా ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News