: ఆస్తి కోసం ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు... సజీవ దహనమైన వృద్ధ తల్లిదండ్రులు


కృష్ణా జిల్లాలో గత రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ కొడుకు ఘాతుకానికి పాల్పడ్డాడు. వృద్ధ తల్లిదండ్రులను సజీవ దహనం చేశాడు. జిల్లాలోని నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలో ఈ ఘటన కలకలం రేపింది. ఆస్తి ఇవ్వడం లేదన్న అక్కసుతో సదరు యువకుడు రాత్రి సమయంలో అందరూ ఆదమరచి నిద్రిస్తున్న వేళ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ క్రమంలో ఇంటిలో నిద్రిస్తున్న అతడి తల్లిదండ్రులు ఆ మంటల్లో చిక్కి సజీవదహనమయ్యారు. ఆ ఘటనలో సదరు యువకుడికీ స్వల్ప గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News