: రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యేకు గాయాలు... ఆస్పత్రిలో చికిత్స


నేటి తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కావలి ఎమ్మెల్యే ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు నాయుడుపేట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆయన సన్నిహితులు హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకి ప్రాణాపాయమేమీ లేదని అపోలో వైద్యులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News