: కిడ్నీలోంచి 420 రాళ్లు తీశారు


కిడ్నీలో ఒకట్రెండు రాళ్లు ఉంటేనే నరకం అనుభవిస్తారు. అలాంటిది ఓ వ్యక్తి కిడ్నీలోంచి ఏకంగా 420 రాళ్లు తీశారు చైనా వైద్యులు. చైనాలోని జోజియాంగ్ ప్రావిన్స్ లోని జిన్హువా నగరంలోని డోంగ్ యాంగ్ పీపుల్స్ ఆసుపత్రి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించి, హీడాంగ్ (56) అనే వ్యక్తి కిడ్నీలోంచి 420 రాళ్లు బయటికి తీశారు. చైనాలో విరివిగా దొరికే టోపు జిప్సమ్ అనే వంటకాన్ని అతిగా తినడంతో అతని కిడ్నీలో వందలకొద్దీ రాళ్లు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ఈ వంటకంలో కాల్షియం సల్ఫేట్ శాతం ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ తిని తక్కువ నీరు తాగడం వల్ల ఆయన కిడ్నీల్లో రాళ్లు చేరాయని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News