: సైఫాబాద్ పీఎస్ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన న్యాయవాది
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైదరాబాదులోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. శ్రీరంగారావు అనే న్యాయవాది చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఏపీ సీఎంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.