: ఆ పుణ్యక్షేత్రం మీదుగా విమానాలు అనుమతించవద్దు: కేంద్రానికి ఒడిశా ముఖ్యమంత్రి లేఖ
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ్ ఆలయం మీదుగా విమానాల రాకపోకలను అనుమతించవద్దంటూ కేంద్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లేఖ రాశారు. జగన్నాథుని ఆలయంలో జూలై 18, 26, 27 తేదీల్లో నబకళేబర ఉత్సవాలు నిర్వహిస్తున్నందున, ఆలయ, భక్తుల భద్రత దృష్ట్యా విమానాలు, హెలీకాప్టర్లు ఆలయం మీదుగా తిరగడాన్ని నిషేధించాలని లేఖలో ఆయన కోరారు. ఈ లేఖను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్, భువనేశ్వర్ విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డైరెక్టర్ కు అందజేసినట్టు ఒడిశా ప్రభుత్వం తెలిపింది.