: అకారణంగా పాపను చంపేయబోయారు...విజయవాడలో వైద్యుల నిర్వాకం
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్వాకంతో పసిపాప ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విజయవాడకు చెందిన ఓ దంపతులు తమ ఏడాది పాపకు అనారోగ్యం రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెకు చికిత్స చేసిన వైద్యులు పాప మృతి చెందిందని డిశ్చార్జ్ చేశారు. దీంతో డబ్బు ఖర్చైనా పాప మిగల్లేదని, కడుపుకోతే మిగిలిందని నిరాశలో కూరుకుపోయిన పాప తల్లిదండ్రులు ఆమెను ఖననం చేసేందుకు శ్మశానానికి తీసుకెళ్లారు. ఇంతలో పాప ఊపిరి ఆడడం గమనించిన తల్లిదండ్రులు, తంతును ఆపేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.