: తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిపై రాష్ట్రపతికి నరసింహన్ నివేదిక


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం తదితర పరిణామాలపై గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. రాష్ట్ర విభజన అనంతరం సమస్యలున్న అంశాల గురించి కూడా ఆయన చర్చించినట్టు సమాచారం. తనపై వస్తున్న విమర్శల గురించి కూడా ప్రణబ్ వద్ద గవర్నర్ ప్రస్తావించినట్టు తెలిసింది. కాగా, ఈ సాయంత్రం 5:30 గంటల సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో నరసింహన్ సమావేశం కానున్నారు. ఇదిలావుండగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ను తొలగించి, రెండు రాష్ట్రాలకూ వేర్వేరు గవర్నర్లను నియమించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News