: ఆ డిన్నర్ విలువ 15 కోట్లు!


భోజనం విలువ 15 కోట్లా? అని మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, అది మామూలు డిన్నర్ కాదు, ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ తో కలసి చేసే విందు. ఆ అవకాశాన్ని గేమింగ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ 'దా లియిన్ జూ' దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే, ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ 'ఈబే' ప్రతి ఏడాది వారెన్ బఫెట్ తో డిన్నర్ చేసే అవకాశాన్ని వేలం వేస్తుంది. ఈ వేలంలో ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికి బఫెట్ తో డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తారు. దీనికోసం ఎంతో మంది ఔత్సాహికులు ఎదురు చూస్తుంటారు. కొన్ని కంపెనీలు ఈ అవకాశం కోసం లాబీయింగ్ కూడా చేస్తాయని ప్రచారం ఉంది. అయితే ఈసారి ఆన్ లైన్ వేలంలో బఫెట్ తో డిన్నర్ చేసే అవకాశాన్ని చైనాకి చెందిన గేమింగ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ 'దా లియిన్ జూ' 23 లక్షల డాలర్లకు (సుమారు 15 కోట్లు) సొంతం చేసుకుంది. డిన్నర్ లో మొత్తం ఎనిమిది మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాపార సూత్రాలు ఔపోసన పట్టిన బఫెట్ తో డిన్నర్ అంటే 15 కోట్ల పెట్టుబడికి మరిన్ని కోట్ల రాబడి దక్కించుకునే డీల్ కుదిరినట్టేనని వ్యాపార వర్గాలు భావిస్తుంటాయి. ఈ 'డిన్నర్ వేలం' ద్వారా వచ్చిన మొత్తాన్ని శాన్ ఫ్రాన్సిస్కో లోని గ్లైడ్ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందజేస్తారు

  • Loading...

More Telugu News