: స్టీఫెన్ సన్ నుంచి కేసీఆర్ రూ.కోటి తీసుకున్నాడు: మత్తయ్య ఫిర్యాదు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ 506, 507, 387 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. స్టీఫెన్ సన్ ను నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమించేందుకు కేసీఆర్ రూ.కోటి తీసుకున్నాడంటూ 'ఓటుకు నోటు' వ్యవహారంలో నాలుగో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఈ ఫిర్యాదు చేశాడు. తెలంగాణ పోలీసుల నుంచి తనకు ప్రాణభయం ఉందని, తన తమ్ముడిని హైదరాబాద్ తీసుకెళ్లి పోలీసులు కొట్టారని ఫిర్యాదులో మత్తయ్య పేర్కొన్నాడు. నాలుగు రోజులుగా తన భార్య, పిల్లలను అక్రమంగా నిర్బంధించారని, సీఎం చంద్రబాబును కేసులో ఇరికించమని ఫోన్లో ఒత్తిడి చేస్తున్నట్టు చెప్పాడు.

  • Loading...

More Telugu News