: ఉమాభారతితో సీఎం చంద్రబాబు సమావేశం రద్దు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సమావేశం కావల్సి ఉండగా రద్దైంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల సమావేశం రద్దయిందని సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉమాభారతికి ఫోన్ చేసి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో బాబు భేటీ అవుతారు.