: రేవంత్ ను స్నేహపూర్వకంగానే కలిశా: విష్ణువర్ధన్ రెడ్డి
టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కేవలం స్నేహపూర్వకంగానే కలిశానని కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆయన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ ను కలసిన అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడారు. రేపు రేవంత్ కుమార్తె నిశ్చితార్థం నేపథ్యంలో ఏమైనా సహాయ కార్యక్రమాలు చేయాలా? అడిగానని చెప్పారు. జైలు నుంచి క్షేమంగా బయటకు వస్తావని రేవంత్ కు ధైర్యం చెప్పానన్నారు. కాగా ఈరోజు రేవంత్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా కలిశారు.