: చంద్రబాబును అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదు: ఎర్రబెల్లి వ్యాఖ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని అడ్డుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల కాదని టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కొద్దిసేపటి క్రితం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి ఓటుకు నోటు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఒక్క హైదరాబాదుపైనే కాక తెలంగాణలోని అన్ని జిల్లాలపై హక్కుందని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. అక్రమ కేసులకు టీడీపీ భయపడబోదని ఆయన స్పష్టం చేశారు. ఏసీబీని అడ్డుపెట్టుకుని టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్న కేసీఆర్ కుట్రలు చెల్లవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవుల ఆశచూపి తమ పార్టీ నేతలను లాక్కున్న కేసీఆర్ కు తమ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News