: ఇండియాలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే


ఢిల్లీలోని ఐఐటీ దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీగా, కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్శిటీ అత్యుత్తమ ప్రభుత్వ కాలేజీగా ఎంపికయ్యాయి. 2015 సంవత్సరానికిగాను ఎడ్యూ-రాండ్ విడుదల చేసిన ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీల జాబితాలో ఢిల్లీ, ఖరగ్ పూర్, ముంబై, చెన్నై, గౌహతి, కాన్పూర్ లలోని ఐఐటీలు తొలి ఆరు స్థానాల్లో నిలిచాయి. కాలేజీల విషయానికి వస్తే ప్రైవేటు విభాగంలో బిట్స్ పిలానీ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం అన్ని కాలేజీలనూ పరిగణనలోకి తీసుకుంటే జాదవ్ పూర్ వర్శిటీ 11వ స్థానంలో, బిట్స్ పిలానీ పదవ స్థానంలో నిలిచాయని ఎడ్యూ-రాండ్ ప్రకటించింది. ఇటీవలే ఇండియాలో తొలి ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీగా ఆవిర్భవించిన బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ యూనివర్శిటీకి 13వ స్థానం లభించింది. వర్శిటీలు, కాలేజీల్లో విద్యాభ్యాసం తరవాత లభించే ఉద్యోగావకాశాలు, రీసెర్చ్ విభాగంలో జరుగుతున్న శోధన, ఫ్యాకల్టీల క్వాలిఫికేషన్, అదే కాలేజీలో ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి వచ్చే డిమాండ్ తదితరాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చినట్టు ఎడ్యు-రాండ్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News