: టీఆర్ఎస్ తో జగన్ కుమ్మక్కయ్యారు: ధూళిపాళ్ల నరేంద్ర


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో కుమ్మక్కయ్యారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. తెలంగాణలో తన పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిని టీఆర్ఎస్ లాక్కుంటే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు జగన్ ఎలా ఓటేయిస్తారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన నరేంద్ర, ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తెలంగాణ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం కుట్రపూరితంగా ఓటుకు నోటు కేసును అవకాశంగా తీసుకుంటోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు కుట్రలను అర్థం చేసుకోకుండా కేసీఆర్ కు మద్దతు పలుకుతూ జగన్ కూడా ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగస్వాములవుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News