: షారూఖ్, అమీర్ లను ఏమైనా అన్నారో...!: అభిమానులకు సల్మాన్ హెచ్చరిక


తన సహనటులు షారూఖ్, అమీర్ లను ఏమైనా విమర్శిస్తే, తన ట్విట్టర్ ఖాతాను మూసివేస్తానని కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అభిమానులను హెచ్చరించారు. గత సంవత్సరంగా ముగ్గురు 'ఖాన్'లూ కలసిపోయారన్న సంకేతాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతాలో కొందరు షారూఖ్, అమీర్ లను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తుండటాన్ని గమనించిన ఆయన కాస్తంత ఘాటుగానే స్పందించారు. తప్పుడు గుర్తింపుతో ఖాతాలు తెరచిన వారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని అన్న ఆయన, గత రాత్రి పలు ట్వీట్లు చేశారు. హిందీ చిత్రసీమలో 1,2,3 ర్యాంకులు లేవని, తామంతా ఒకటేనని అన్నారు. అభిమానులు నియంత్రణ పాటించకుంటే తన ట్విట్టర్ ఖాతాను మూసేస్తానని హెచ్చరించారు. అభిప్రాయాలు, ప్రేమను పంచుకోవడానికి మాత్రమే ట్విట్టర్ ను వేదికగా చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News