: వన్డే మ్యాచ్ లా బాదేస్తున్న ధవన్... అర్ధ సెంచరీ పూర్తి
బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు క్రికెట్ తొలి రోజు ఆటలో భాగంగా భారత బ్యాట్స్ మెన్ శిఖర్ ధవన్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపుతున్నాడు. తొలి రెండు ఓవర్లూ నిదానంగా ఆడిన ఓపెనర్లు, ఆపై బ్యాటుకు పనిచెప్పారు. ఈ క్రమంలో ధవన్ టెస్టు మ్యాచ్ లా కాకుండా, వన్డేను తలపించేలా విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ధవన్ 53 బంతుల్లో 56, మురళీ విజయ్ 43 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత స్కోరు 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు.