: ఢిల్లీలో వెంకయ్యతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. ప్రభుత్వ పథకాలు స్వచ్ఛ భారత్ మిషన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పథకాలపై సమావేశంలో చర్చించారు. అంతేగాక స్మార్ట్ సిటీ పథకాల్లో భాగంగా లబ్ధిపొందే ప్రాంతాలను గుర్తించాలని బాబుకు వెంకయ్య సూచించారు. పోతే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలంరేపిన ఓటుకు నోటు వ్యవహారంపై ఎంతవరకు మాట్లాడుకున్నారనేది వెల్లడికాలేదు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి ఉమాభారతితో చంద్రబాబు సమావేశమవుతారు.