: వెంకన్న భక్తుల్లో ఒకడిగా.... తిరుమల కొండపై సాదాసీదాగా సుప్రీంకోర్టు సీజే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు భిన్నమైన వ్యక్తి. హంగూ ఆర్భాటమంటే ఆయనకు అసలు గిట్టదు. అవసరమైన చోట తప్పించి తనకు ప్రత్యేక ఏర్పాట్లు, భద్రత అవసరం లేదంటారు ఆయన. నిన్న తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన దత్తు, కాలిబాట ద్వారానే కొండపైకి చేరుకున్నారు. ఆ తర్వాత నిన్న ఉదయం కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి హడావిడి లేకుండా సాధారణ భక్తుల మాదిరిగా వారిలోనే కలిసిపోయి కింద కూర్చుని సేదదీరారు.