: కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పిన 'రాహుల్ కన్ఫ్యూజ్' థియరీ
కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. భూసేకరణ బిల్లు విషయంలో ఈ కాంగ్రెస్ నేత ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని, తానూ కన్ఫ్యూజ్ అవుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు. కోయంబత్తూరులో ఆయన మాట్లాడుతూ... "ఓ కాంగ్రెస్ నేత దేశవ్యాప్తంగా తిరుగుతూ భూసేకరణ బిల్లుపై ప్రజలను, రైతులను గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ పార్టీ వారికి సమస్యలేవీ (లేవనెత్తేందుకు) లేవు. ఓ అబద్ధాన్ని వందసార్లు పదేపదే చెబితే అది నిజమైపోతుందన్న గోబెల్స్ థియరీని ఆ నాయకుడు అనుసరిస్తున్నట్టుంది. ఆయన ఇతరులను కన్ఫ్యూజ్ చేసే క్రమంలో తానే కన్ఫ్యూజ్ అవుతున్నారు" అని ఎద్దేవా చేశారు.