: చంద్రబాబు నివాసం వద్ద కొత్త భద్రత సిబ్బంది... తెలంగాణ పోలీసుల స్థానంలో ఏపీ పోలీసులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద భద్రత సిబ్బందిని మార్చివేశారు. కొత్త వారిని నియమించారు. బాబు నివాసం భద్రత పర్యవేక్షణను అదనపు ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఆడియో టేపులు తెరపైకి వచ్చిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్టు అర్థమవుతోంది. తెలంగాణ పోలీసులు ఉన్న చోటు ఆంధ్రా పోలీసులను నియమించారు. ఇక, గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లోనూ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.