: తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన పతనం
స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగింది. సెషన్ ఆరంభం నుంచి పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన బెంచ్ మార్క్ సూచికలు స్వల్ప నష్టాల్లో ముగిసాయి. మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడమే ఇన్వెస్టర్లను వేచిచూసే ధోరణికి తీసుకెళ్లిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 41.84 పాయింట్లు పడిపోయి 0.16 శాతం నష్టంతో 26,481.25 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 21.75 పాయింట్లు పడిపోయి 0.27 శాతం నష్టంతో 8,022.40 పాయింట్ల వద్ద కొనసాగాయి. నిఫ్టీ-50లో 30 కంపెనీల ఈక్విటీలు నష్టపోగా, 20 కంపెనీలు లాభాల్లో కొనసాగాయి. వీఈడీఎల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, గెయిల్ తదితర కంపెనీలు ఒకటి నుంచి రెండున్నర శాతం వరకూ లాభపడగా, కెయిర్న్, సిప్లా, విప్రో, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు 2 నుంచి 4.5 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లు 0.3 శాతం పడిపోయాయి.