: శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల దాడి... చెట్ల చాటున నక్కి ప్రాణాలు దక్కించుకున్న అటవీశాఖ సిబ్బంది
శేషాచలం అడవుల్లో మరోసారి 'ఎర్ర' కలకలం రేగింది. ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ ప్రత్యక్షమయ్యారు. వట్టికోన సమీపంలో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి తెగబడ్డారు. మంగళవారం సాధారణ పర్యవేక్షణకు బయల్దేరిన అటవీ శాఖ సిబ్బందికి స్మగ్లర్లు ఎదురయ్యారు. అటవీ శాఖ సిబ్బందిని చూడడంతోనే వాళ్లు రెచ్చిపోయారు. రాళ్ల వర్షం కురిపించారు. ప్రతిగా కాల్పులు జరిపినా వారు రాళ్ల దాడి ఆపలేదు. వెంటపడి తరిమారు. దీంతో, అటవీ శాఖ సిబ్బంది చెట్ల మాటున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం, స్మగ్లర్లు వెళ్లిపోయాక ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.