: బాబు, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: గుత్తా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు సీఎంలు గ్యాంగ్ వార్ చేసుకుంటున్నారని అన్నారు. ముఠా కక్షలు తీర్చుకునేందుకు ఉపక్రమించారని ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు అవకాశాలు వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. వారి వారి పార్టీ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య ఆత్మగౌరవ పోరాటంగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.