: రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు నిందితులకు ముగిసిన ఏసీబీ కస్టడి
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలకు ఏసీబీ కస్టడీ గడువు కొద్దిసేపటి క్రితం ముగిసింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల క్రితం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాలుగు రోజుల పాటు విచారించారు. తుది రోజు విచారణలో భాగంగా నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా విచారణ కొనసాగింది. కోర్టు అనుమతిచ్చిన గడువు ముగియడంతో రేవంత్ సహా ముగ్గురు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి కాగానే నిందితులను ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.