: హైదరాబాదుపై తెలంగాణ పోలీసుకు మాత్రమే అధికారాలు: టీ డిప్యూటీ సీఎం కడియం


తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో పోలీసు అధికారాలపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదుపై తెలంగాణ పోలీసు అధికారులకు మాత్రమే అధికారాలు ఉంటాయని ఆయన అన్నారు. ఏపీ పోలీసులకు ఏమాత్రం అధికారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆంధ్రా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఫోన్ ను తాము ట్యాప్ చేయలేదని కడియం పేర్కొన్నారు. అసలు చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా తమకు లేదన్నారు. స్టీఫెన్ ఫిర్యాదు మేరకే ఆయన ఫోన్ సంభాషణలను ఏసీబీ రికార్డు చేసిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఘటనను చంద్రబాబు ఎందుకు ఖండించలేదని కూడా ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదంగా మార్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని కడియం ఆరోపించారు.

  • Loading...

More Telugu News