: కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు... ఏపీ మంత్రి కామినేని ఆరోపణ


తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. నిన్నటి మహా సంకల్ప సభకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే వారు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేవలం 63 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 85 ఓట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను పెంచి పోషిస్తున్న కేసీఆర్ టీడీపీపై ఆరోపణలు చేయడం సబబు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News